ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది. ముఖ్యమైన మార్పులు ఇవే:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.


