*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం, అలాగే వీరవల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


