నందలూరు: సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫార్మ్‌లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్మెంట్లు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నందలూరు సబ్ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసేలా ఎలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులతో పాటు, సంబంధిత గ్రూపుల నిర్వాహకులు (అడ్మిన్లు) కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని ఎస్ఐ స్పష్టం చేశారు.


