గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది
విషయాన్ని తెల్లవారుజామున 5 గంటలకే గమనించిన 69వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సండ్రానా భాస్కర్ వెంటనే స్పందించారు.
JCB సహాయంతో చెరువు గట్టుకు నాలుగు చోట్ల గండి కొట్టించి, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని తిరిగి చెరువులోకి మళ్లించారు.
దీంతో ముంపు నుండి స్థానికులకు ఉపశమనం కలిగింది.


