Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ప్రధాని మోదీజీ జన్మదిన సేవా సంకల్ప ఉత్సవాలలో భాగంగా వడ్లపూడిలో ప్రత్యేక పూజలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రధాని మోదీజీ జన్మదిన సేవా సంకల్ప ఉత్సవాలలో భాగంగా వడ్లపూడిలో ప్రత్యేక పూజలు.

వార్త ముఖ్యాంశాలు

  • వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలోని పంచముఖ వినాయకుడికి 108 స్వీట్స్ తో సారె సమర్పణ.
  • బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • అనంతరం వినాయక రూపంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు.

వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలోని పంచముఖ వినాయకుడికి 108 స్వీట్స్ తో సారె సమర్పణ. బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అనంతరం వినాయక రూపంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. మోదీజీ నిండు నూరేళ్లు జీవించాలని, భారత్ ను విశ్వగురువు చేయాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా మహిళలు, గ్రామ పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బొండా యల్లాజీరావు మాట్లాడుతూ మోదీజీ 25 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ నేతలే మోదీజీని తమ బాస్, మార్గదర్శకుడిగా భావిస్తున్నారని కొనియాడారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండా జగన్, ఈర్లి శ్రీరాములు, మింది రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ నుండి మింది గోవింద, కర్రి కృష్ణ, మడక అప్పలరాజు పాల్గొన్నారు. మహిళా నాయకులు బొండా శ్రీదేవి, లక్ష్మి, సుజాత, మంగసత్య తదితరులు హాజరయ్యారు.
భజన మండలి సభ్యులు కుమారి, పద్మ, షాలిని, విజయలక్ష్మి పాల్గొన్నారు.. అర్చకులు నరసింహమూర్తి, సత్యనారాయణలు మోదీజీ పేరున ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *