ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండల కేంద్రంలో ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ను ఖానాపురం మండల అధ్యక్షులు వీరమల్ల రాములు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన వాల్పోస్టర్ కార్యక్రమంలో నందగిరి రజినీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసిందని.
ఆ కమిటీ అనేక సంప్రదింపులు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నివేదిక సమర్పించడం జరిగిందని.
ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ముఖ్యమంత్రి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈనెల 27వ తేదీన జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఖానాపురం మండలం నుంచి ఉద్యమకారులు అందరు కూడా పాల్గొనివిజయవంతంచేయాలని ఆయనపిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారుడు ఉద్యమ నాయకులు వల్లే శ్రీనివాస్. రామ సహాయం ఉపేందర్ రెడ్డి.
జాటూత్ బాలు నాయక్.
భూస అశోక్. భూష కుమారస్వామి కోల వీరన్న మద్దూరు రాజన్న పోతరాజు కట్టన్న ప్రధాన కార్యదర్శి రాజు. జిల్లా ఉపాధ్యక్షులు సతీష్. నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి డోనాల రవికుమార్.
నర్సంపేట పట్టణ అధ్యక్షులు మాదాసి శ్రీనివాస్.



