సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం*
*8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం*
*హుండీ కానుకలు రూ.28.94 కోట్లు – 33 లక్షల లడ్డూల విక్రయం*
*21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ – 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పణ*
*గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించాం*
*20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు*
*తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు*
*టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు*
తిరుమల, 2026 సెప్టెంబరు 23:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు తెలిపారు.
బుధవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో కలిసి చైర్మన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముఖ్యాంశాలను వివరించారు.
*బ్రహ్మోత్సవాలకు విశేష స్పందన*
సెప్టెంబరు 15 నుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారని తెలిపారు.
*బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు*
ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
రూ.28.94 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
33 లక్షల లడ్డూలు విక్రయించారు.
ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించారు
*గరుడసేవలో ప్రత్యేక ఏర్పాట్లు*
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు.
గరుడసేవ రోజున భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను, పాలక మండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో ప్రత్యక్షంగా పర్యటించి భక్తులతో మాట్లాడినట్లు తెలిపారు.
టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పాలక మండలి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
*కొత్త సదుపాయాలు ప్రారంభం*
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.
అలాగే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాం.
అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
*భవిష్యత్ ప్రణాళికలు*
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
*ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు*
వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా, జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తమ కళాప్రదర్శన చేసిన కళాబృందాలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ప్రతిరోజూ వాహనసేవలో నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో సన్మానించారు.
తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలోనూ భక్తులను ఆకట్టుకునేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
*పుష్పాలంకరణ*
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టారు.
*విద్యుత్ అలంకరణలు*
తిరుమలలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
*ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు*
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా మరింత నాణ్యమైన హెచ్డీ క్వాలిటీలో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు. ప్రముఖ పండితులతో వ్యాఖ్యానాలు అందించారు.
*శ్రీవారి సేవకుల సేవలు*
బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు.
*వైద్య సేవలు*
భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారు
*భద్రతా ఏర్పాట్లు*
బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
*పారిశుద్ధ్య నిర్వహణ*
గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలు అందించారు.
గరుడసేవ సందర్భంగా తిరుమలలో సేకరించిన సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు.
భక్తులకు మరుగుదొడ్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు గరుడసేవ సందర్భంగా విశేష సేవలందించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన టీటీడీ అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులందరికీ టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల వైభవాన్ని తమ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి టి. జానకి దేవి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జంగా కృష్ణ మూర్తి, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం
సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం* *8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం* *హుండీ కానుకలు రూ.28.94 కోట్లు – 33 లక్షల లడ్డూల విక్రయం* *21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ – 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పణ* *గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించాం* *20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు* *తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు* *టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు* తిరుమల, 2026 సెప్టెంబరు 23:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో కలిసి చైర్మన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముఖ్యాంశాలను వివరించారు. *బ్రహ్మోత్సవాలకు విశేష స్పందన* సెప్టెంబరు 15 నుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారని తెలిపారు. *బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు* ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.28.94 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 33 లక్షల లడ్డూలు విక్రయించారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించారు *గరుడసేవలో ప్రత్యేక ఏర్పాట్లు* శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు. గరుడసేవ రోజున భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను, పాలక మండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో ప్రత్యక్షంగా పర్యటించి భక్తులతో మాట్లాడినట్లు తెలిపారు. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పాలక మండలి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. *కొత్త సదుపాయాలు ప్రారంభం* ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాం. అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. *భవిష్యత్ ప్రణాళికలు* తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. *ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు* వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా, జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తమ కళాప్రదర్శన చేసిన కళాబృందాలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ప్రతిరోజూ వాహనసేవలో నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో సన్మానించారు. తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలోనూ భక్తులను ఆకట్టుకునేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. *పుష్పాలంకరణ* బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టారు. *విద్యుత్ అలంకరణలు* తిరుమలలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. *ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు* ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా మరింత నాణ్యమైన హెచ్డీ క్వాలిటీలో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు. ప్రముఖ పండితులతో వ్యాఖ్యానాలు అందించారు. *శ్రీవారి సేవకుల సేవలు* బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. *వైద్య సేవలు* భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారు *భద్రతా ఏర్పాట్లు* బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. *పారిశుద్ధ్య నిర్వహణ* గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలు అందించారు. గరుడసేవ సందర్భంగా తిరుమలలో సేకరించిన సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. భక్తులకు మరుగుదొడ్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు గరుడసేవ సందర్భంగా విశేష సేవలందించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన టీటీడీ అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులందరికీ టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని తమ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి టి. జానకి దేవి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జంగా కృష్ణ మూర్తి, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

