ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ (ఆదివారం) యాదాద్రిలో నిర్వహించనున్న 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గం నుంచి ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మంథని సాయికుమార్, ముత్తారం మండల శాఖ అధ్యక్షుడు బండారి సుధాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడమే ఈ వార్షికోత్సవ సభ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ఉద్యమ కాలంలో తాము పాల్గొన్న కార్యక్రమాలు, పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని (ఉద్యమ డాటా) వెంట తీసుకురావాలని సూచించారు. ఈ మహాసభ యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో గల జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


