Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

పదవ తరగతి విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పదవ తరగతి విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలి అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాడేపు అనిల్ కుమార్, తాడేపు సురేష్, ఆకారం బాలచంద్రం, గున్నాల రాజు, నిమ్మ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *