Wednesday, 23 September 2026
  • Home  
  • జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కళాజాత చెన్నారావుపేట ఎస్పై రాజేష్ రెడ్డి
- వరంగల్

జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కళాజాత చెన్నారావుపేట ఎస్పై రాజేష్ రెడ్డి

చెన్నారావుపేట, సెప్టెంబర్ 22 పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాత్రి సూరిపల్లి గ్రామంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న పలు అసాంఘిక కార్యకలాపాలు, నేరాలపై ప్రజలను పాటలు, నాటికలు, మ్యాజిక్ షో రూపంలో చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల పై అప్రమత్తత, రోడ్డు భద్రత నియమాలు, మహిళా రక్షణ, డయల్ 100, శాంతిభద్రతల పరిరక్షణ, సామాజిక బాధ్యత అంశాలపై గ్రామస్తులకు, గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం రజిత సురేష్ గౌడ్, ఉప సర్పంచ్ గాడుదుల రాజశేఖర్, వార్డు సభ్యురాలు బత్తిని కమల, కానిస్టేబుల్ యాకయ్య, పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.