పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి.

బోగోలు, ముంగమూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోగోలు మండలంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
ముంగమూరులోని భవాని ఏయిడ్స్ ఆదరణ కేంద్రంలోని బాధితులు, నిరాశ్రయులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుట్టు బోయిన బ్రహ్మానందం గారు, రాజ్యలక్ష్మి గారు, బీజేపీ బోగోలు మండల అధ్యక్షుడు వీరాల శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

