Wednesday, 23 September 2026
  • Home  
  • దమ్మాయిగూడ గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం సోదరుల సమైక్యత – ₹40 వేలకు దక్కించుకున్న ఎస్‌.కె. మొసీమ్
- మేడ్చల్ – మల్కాజిగిరి

దమ్మాయిగూడ గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం సోదరుల సమైక్యత – ₹40 వేలకు దక్కించుకున్న ఎస్‌.కె. మొసీమ్

దమ్మాయిగూడ (మేడ్చల్): మత సామరస్యానికి ప్రతీకగా దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్, పీర్ల కొట్టం బొడ్డు రాయి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో ముస్లిం సోదరులైన అక్బర్, ఎస్‌.కె. మొసీమ్ పోటాపోటీగా పాల్గొన్నారు. చివరికి ఎస్‌.కె. మొసీమ్ రూ. 40,000 కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ​ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీహరి గౌడ్ పాల్గొని విజేతను అభినందించారు. గణేష్ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడం ఇక్కడి సమైక్యతకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. ​– సందీప్, పున్నమి విలేకరి (మేడ్చల్ జిల్లా)

దమ్మాయిగూడ (మేడ్చల్):
మత సామరస్యానికి ప్రతీకగా దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్, పీర్ల కొట్టం బొడ్డు రాయి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ ప్రసాదం లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో ముస్లిం సోదరులైన అక్బర్, ఎస్‌.కె. మొసీమ్ పోటాపోటీగా పాల్గొన్నారు. చివరికి ఎస్‌.కె. మొసీమ్ రూ. 40,000 కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
​ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీహరి గౌడ్ పాల్గొని విజేతను అభినందించారు. గణేష్ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడం ఇక్కడి సమైక్యతకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.
​– సందీప్, పున్నమి విలేకరి (మేడ్చల్ జిల్లా)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.