ఓవర్ లోడ్లతో మితిమీరిన వేగంగా వెళ్తున్న టిప్పర్లు.
అత్యంత ప్రమాదకరంగా మారిన ఇబ్రహీంపట్నం రింగ్.
అధికారుల మౌనమే కారణమా.,….?
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో భారీగా పడ్డ కంకర్ ను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది.
ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్,
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో భారీగా ఓవర్లోళ్ళతో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల రవాణా చేస్తూ కనీసం పట్టా కూడా కట్టకుండా పరిమితికి మించి ట్రక్కు బాడీ పై అధికంగా కంకర మెటీరియల్ రవాణా చేస్తూ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ టి ప్పరుల పై
చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు కోరుతున్నారు.
ప్రమాదకరమైన స్థితిలో రవాణా చేస్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకునే రవాణా శాఖ అధికారులు మౌనం వెనుక దాగున్న నిజమేంటి….?




