Wednesday, 23 September 2026
  • Home  
  • వరికుంటపాడు: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

వరికుంటపాడు మండలం రామాపురం వద్ద ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో వారు సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.