Tuesday, 22 September 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
- అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2026న ఉత్తర్వులు జారీ చేసింది (G.O.Rt.No.1829). పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు , పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి: సి.ఎం. త్రివిక్రమ్ వర్మ: ప్రస్తుతం ఎస్.పి.ఎఫ్ డీజీగా ఉన్న ఈయనను.. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ / డైరెక్టర్ ఎఫ్.ఎస్.ఎల్ (FSL) గా బదిలీ చేశారు. ఆర్. జయలక్ష్మి: ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను.. సీఐడీ సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గా నియమించారు. బి. రాజకుమారి: ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న ఈమెను రైల్వేస్ ఐజీగా బదిలీ చేస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాంతి రాణా టాటా: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈయనకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. విశాల్ గున్ని: పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఈయనను డీఐజీ (ట్రైనింగ్)గా నియమించి, అప్పా (APPA) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాబూజీ అట్టాడ: గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న ఈయనను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, గ్రేహౌండ్స్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. పంకజ్ కుమార్ మీనా: పోలవరం ఓఎస్డీగా ఉన్న ఈయనను మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. జగదీష్ అడహళ్లి: సీఎమ్ఎస్జీ ఎస్పీగా ఉన్న ఈయనను పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించారు. కె. చక్రవర్తి: సీఐడీ ఎస్పీగా ఉన్న ఈయనను పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2026న ఉత్తర్వులు జారీ చేసింది (G.O.Rt.No.1829). పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు , పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:
సి.ఎం. త్రివిక్రమ్ వర్మ: ప్రస్తుతం ఎస్.పి.ఎఫ్ డీజీగా ఉన్న ఈయనను.. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ / డైరెక్టర్ ఎఫ్.ఎస్.ఎల్ (FSL) గా బదిలీ చేశారు.
ఆర్. జయలక్ష్మి: ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను.. సీఐడీ సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గా నియమించారు.
బి. రాజకుమారి: ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న ఈమెను రైల్వేస్ ఐజీగా బదిలీ చేస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాంతి రాణా టాటా: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈయనకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు.
విశాల్ గున్ని: పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఈయనను డీఐజీ (ట్రైనింగ్)గా నియమించి, అప్పా (APPA) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బాబూజీ అట్టాడ: గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న ఈయనను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, గ్రేహౌండ్స్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.
పంకజ్ కుమార్ మీనా: పోలవరం ఓఎస్డీగా ఉన్న ఈయనను మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
జగదీష్ అడహళ్లి: సీఎమ్ఎస్జీ ఎస్పీగా ఉన్న ఈయనను పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించారు.
కె. చక్రవర్తి: సీఐడీ ఎస్పీగా ఉన్న ఈయనను పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.