బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం సెప్టెంబర్ 21,(పున్నమి ప్రతినిధి)
రామవరం లో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జన్ను అశోక్, 7స్టార్ ఇండస్ట్రీస్ వారు సహకారం అందించారు. విగ్రహ దాతలుగా జల్లడపు ప్రవీణ్ కుమార్–శ్వేత దంపతులు వ్యవహరించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో భక్తులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలు జల్లడపు ప్రవీణ్ కుమార్–శ్వేత దంపతులను, అన్నదానానికి సహకరించిన జన్ను అశోక్, 7స్టార్ ఇండస్ట్రీస్ వారిని కమిటీ సభ్యులు పి. వెంకటేష్, బి. వంశీ, కె. రాజేష్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.



