వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) సేవలలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు పౌరులు క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు.
- ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిల్లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూ.ఆర్ కోడ్‌ను ప్రజలు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి సులభంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.
- అలాగే, https://pgrs.ap.gov.in పోర్టల్ ద్వారా కూడా తమ స్పందనను పంచుకోవచ్చని, అర్జీల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) సేవలలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు పౌరులు క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు. ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిల్లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూ.ఆర్ కోడ్‌ను ప్రజలు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి సులభంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, https://pgrs.ap.gov.in పోర్టల్ ద్వారా కూడా తమ స్పందనను పంచుకోవచ్చని, అర్జీల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మెరుగైన సేవల కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.