ముదిరాజ్ సింహగర్జనను విజయవంతం చేయాలి
ముస్తాబాద్, సెప్టెంబర్ 20: ఈనెల 26న రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పిట్ల విట్టల్ ఆధ్వర్యంలో, CWFI రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి పాల్గొని వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. ప్రతి ముదిరాజ్ కుటుంబం నుంచి ప్రజలు తరలివచ్చి సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన గ్రామ ముదిరాజ్ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జెల్ల శ్రీకాంత్, జాల బిక్షపతి, నిమ్మల రాములు, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


