DEO సామా సుబ్బారావును కలిసిన మార్కాపురం జిల్లా కౌన్సిలర్లు
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, కెరీర్ మార్గదర్శకత్వంపై చర్చ
మార్కాపురం జిల్లా సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) శ్రీ సామా సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు, విద్యార్థులలో ఒత్తిడి తగ్గించడం, విద్యా ప్రగతిని మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సరైన మార్గదర్శకత్వం అందించడంలో కౌన్సిలర్ల పాత్ర ఎంతో కీలకమని, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవసరమైన కౌన్సెలింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సమగ్ర శిక్ష పరిధిలోని జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.





