భద్రాద్రి కొత్తగూడెం:- సెప్టెంబర్/20 పున్నమి ప్రతినిధి
కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సమీపంలో ఒక దొడ్ల పాల వ్యాన్ బోల్తా పడింది. అర్ధరాత్రి వేళ పాలు లోడుతో వెళ్తున్న వ్యాన్ (సంఖ్య: TG 05 T 9447) అదుపుతప్పి రహదారిపై పక్కకు ఒరిగిపోయింది.ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పాల ప్యాకెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో పాలు రొడ్డుపాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని డ్రైవర్, క్లీనర్లను సురక్షితంగా బయటకు తీశారు. వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అతి వేగం లేదా డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


