నంద్యాల: సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్ జన్మదిన వేడుకలను నంద్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు సమీపంలో పాత్రికేయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదీప్ కేక్ కట్ చేసి సహచర పాత్రికేయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు ప్రదీప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పాత్రికేయ రంగంలో మరింతగా సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండాలని కోరారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ సహచర పాత్రికేయులు మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సీఎం నాగేంద్ర, రఫీ, మరియదాస్, అబ్దుల్ మజీద్, నాగేశ్వర్ రెడ్డి, నరసింహ శర్మ, నాగరాజు, పెద్దన్న, మౌలాలి, మల్లేష్ నాయక్, బాలునాయక్, పవన్, రఘునాథ్ రెడ్డి, చంటి, ఇమ్రాన్, కటారి తదితరులు పాల్గొని సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్ జన్మదిన వేడుకలు