బోగోలులో కార్యకర్తలకు డిజిటల్ ఐడీ కార్డుల పంపిణీ
బోగోలు: మండలంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు డిజిటల్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ పార్టీ కోర్ జాయింట్ సెక్రెటరీ మద్దిబోయిన వీర రఘు గారు, మండల అధ్యక్షులు ఉప్పాల మాచర్ల గారు, మండల వైస్ ప్రెసిడెంట్ ఏకే సుందర్ రాజు గారు, మండల పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు దేవరకొండ వరుణ్ తేజ్ గారు పాల్గొన్నారు.
అలాగే మండల నాయకులు, పంచాయతీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పున్నమి న్యూస్ రిపోర్టర్
బోగోలు మండలం
(గోపాలకృష్ణారెడ్డి)

