Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్

వార్త ముఖ్యాంశాలు

  • జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్ కడప, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): యోగి వేమన విశ్వవిద్యాలయం జువాలజీ పరిశోధక విద్యార్థిని కుమారి వెంకట భాగ్యశ్రీకి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
  • జంతుశాస్త్ర శాఖ ఆచార్యులు ఎస్‌.పీ.
  • వెంకటరమణ పర్యవేక్షణలో “భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మైదాన, కొండ ప్రాంతాలలో ఉష్ణమండల పియరిడ్ సీతాకోకచిలుకల వైవిధ్యం, విస్తరణ, జీవావరణ జీవశాస్త్రం” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.

జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్

కడప, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి):
యోగి వేమన విశ్వవిద్యాలయం జువాలజీ పరిశోధక విద్యార్థిని కుమారి వెంకట భాగ్యశ్రీకి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. జంతుశాస్త్ర శాఖ ఆచార్యులు ఎస్‌.పీ. వెంకటరమణ పర్యవేక్షణలో “భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మైదాన, కొండ ప్రాంతాలలో ఉష్ణమండల పియరిడ్ సీతాకోకచిలుకల వైవిధ్యం, విస్తరణ, జీవావరణ జీవశాస్త్రం” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

కుమారి వెంకట భాగ్యశ్రీ తన పరిశోధనలో భాగంగా రూపొందించిన పలు పరిశోధనా వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

డాక్టరేట్ అందుకున్న సందర్భంగా భాగ్యశ్రీని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, కులసచివులు ఆచార్య ఎన్‌.సి. గంగిరెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య టి. శ్రీనివాస్, పరిశోధనా పర్యవేక్షకులు, కన్వీనర్, విభాగాధిపతి ఆచార్య వి. అనుప్రసన్న, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *