Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలి: SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలి: SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్

వార్త ముఖ్యాంశాలు

  • జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరాహార నిరసన దీక్షలకు ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు తెలిపింది.
  • గురువారం కళాశాల ఆవరణలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ సందర్శించి, విద్యార్థులతో కలిసి మాట్లాడారు.
  • ​ఈ సందర్భంగా దామెర కిరణ్ మాట్లాడుతూ...

జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరాహార నిరసన దీక్షలకు ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం కళాశాల ఆవరణలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ సందర్శించి, విద్యార్థులతో కలిసి మాట్లాడారు.
​ఈ సందర్భంగా దామెర కిరణ్ మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన కోరికలు తీరే వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో SFI వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్, పాలిటెక్నిక్ కళాశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *