Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు….

ఖానాపురం పున్నమి ప్రతినిధి..
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దంతాల రాంబాబు, శ్రీనాథ్ ల తండ్రి దంతాల బుచ్చయ్య దశదినకర్మకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దంతాల రాంబాబు, శ్రీనాథ్ ల తండ్రి దంతాల బుచ్చయ్య గారు ఇటీవల మృతి చెందగా, వారి దశదినకర్మ కార్యక్రమం ఈరోజు వారి స్వగృహంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య లు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి ఉపేందర్ రెడ్డి, ఆశ్చర్య కాలేజ్ ప్రిన్సిపల్ సాగర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చ యాదగిరిరావు, అయోధ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు కూస లింగమూర్తి, పిన్నపురెడ్డి తిరుపతిరెడ్డి, ఆబోతు అశోక్ యాదవ్ కాట్రాల రమేష్, నోముల నరేష్, రాపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *