వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా మంగళగిరి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం, మండపాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్, భద్రతా సౌకర్యాలను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఉదయగిరి : వినాయక మండపాలను పరిశీలించిన పోలీసులు