Tuesday, 15 September 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

నెల్లూరు: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. నెల్లూరు పట్టణంలోని జయభారత్ హాస్పిటల్ ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కోశాధికారి గుర్రం సుధాకర్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమల వల్ల నీరు, భూమి కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి ప్రతిమలను వినియోగించి ప్రకృతిని కాపాడేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమితి సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.