ఖానాపూర్ మండలంలో “ *ఆయిల్‌పామ్‌లో మెరుగైన సాగు పద్ధతులు”* అనే అంశంపై రైతులకు *శిక్షణా కార్యక్రమం* నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ *జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీ ఆర్. శ్రీనివాసరావు* గారు ముఖ్య అతిథిగా హాజరై, సుమారు 2½ గంటల పాటు ఆయిల్‌పామ్ సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై సమగ్ర సాంకేతిక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాటడం నుంచి గెలల కోత వరకు పాటించాల్సిన పద్ధతులను వివరిస్తూ, నత్రజని, భాస్వరం, పొటాష్, మెగ్నీషియం, బోరాన్, కాల్షియం వంటి పోషకాల సమతుల్య వినియోగం, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత, నీటి యాజమాన్యం తదితర అంశాలను వివరించారు. ముఖ్యంగా నాలుగేళ్ల వయస్సు గల తోటల్లో చెట్టు మొదలు నుంచి సుమారు 3 అడుగుల దూరంలో మైక్రోజెట్ల ద్వారా నీటిని అందించడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుందని సూచించారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయిల్‌పామ్‌లో పరాగసంపర్కం, వీవిల్స్ జీవనశక్తి మరియు గెలల ఏర్పాటుపై కలిగే ప్రభావాలను వివరించి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అనంతరం రైతులు అడిగిన వివిధ సాంకేతిక సందేహాలకు సమగ్రంగా సమాధానాలు అందించారు. *హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీ తరుణ్* ఆయిల్‌పామ్ తోటలకు అందుబాటులో ఉన్న యాంత్రీకరణ రాయితీలను వివరిస్తూ, కొత్త తోటల్లో ఎలుకల నివారణకు వైర్‌మెష్, గెలల కోతకు ఉపయోగించే మోటరైజ్డ్ చిసెల్పై 50% రాయితీ గరిష్ఠంగా ₹15,000, కలుపు నివారణకు రొటరీ స్లాషర్పై 50% రాయితీ గరిష్ఠంగా ₹70,000, పశుగ్రాసం/ఆకుల కోతకు చాఫ్ కట్టర్‌పై 50% రాయితీ గరిష్ఠంగా ₹50,000 వరకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా *ఆయిల్‌పామ్ కమిటీ చైర్మన్ శ్రీ కృష్ణారెడ్డి* మాట్లాడుతూ మరింత మంది రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహిస్తూ, వరి సాగు నుంచి ఆయిల్‌పామ్ వైపు పంట మార్పిడిని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో *ATMA చైర్మన్ శ్రీ బిక్షం రెడ్డి* , *ఆయిల్‌పామ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కొముర రెడ్డి* , *కార్యదర్శి శ్రీ కుంచారపు వెంకట్ రెడ్డి* , రైతులు శ్రీ *సుబ్బారావు,* శ్రీ *రెడ్డి నర్సింహారెడ్డి* తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ పంటలో శాస్త్రీయ పద్ధతుల అవగాహనా సదాసు