తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కళాకారుడు పిఎస్ మనీ మట్టి వినాయక విగ్రహాల తయారీతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా లైవ్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు కోరిన విగ్రహాలను స్పాట్లోనే సుమారు ఒక్క నిమిషంలో తయారు చేసి అందిస్తున్నారు. రసాయన రంగులకు బదులుగా పర్యావరణహిత మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.



