Monday, 14 September 2026
  • Home  
  • శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు
- నిర్మల్

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు నీటి విడుదల 20 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం.. మూడు మండలాల రైతులకు ఊరట నిర్మల్: సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతులకు ఊరట లభించింది. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో మూడు మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు శ్రీహరిరావు సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. శ్రీహరిరావు విజ్ఞప్తిపై మంత్రి అధికారులతో చర్చించి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, కాలువకు నీటి విడుదలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నీటిని వారాబందీ పద్ధతిలో విడుదల చేయనున్నందున రైతులు పరస్పర సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ చైర్మన్ కొండ్రు రామ్‌రెడ్డి, గండి రామన్న, దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మామడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, బాపయ్య, ప్రతాప్‌రెడ్డి, గంగారెడ్డి కలగిరి తదితరులు పాల్గొన్నారు.

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు నీటి విడుదల

20 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం.. మూడు మండలాల రైతులకు ఊరట

నిర్మల్: సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతులకు ఊరట లభించింది. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు.

శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో మూడు మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు శ్రీహరిరావు సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారని తెలిపారు.

శ్రీహరిరావు విజ్ఞప్తిపై మంత్రి అధికారులతో చర్చించి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, కాలువకు నీటి విడుదలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నీటిని వారాబందీ పద్ధతిలో విడుదల చేయనున్నందున రైతులు పరస్పర సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఆత్మ చైర్మన్ కొండ్రు రామ్‌రెడ్డి, గండి రామన్న, దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మామడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, బాపయ్య, ప్రతాప్‌రెడ్డి, గంగారెడ్డి కలగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.