Friday, 11 September 2026
  • Home  
  • గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం
- పెద్దపల్లి

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్‌జీఎఫ్ (SGF) జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా ప్రారంబించగా, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం – క్రీడల ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం” అనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, పీఈటి దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్‌జీఎఫ్ (SGF) జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా ప్రారంబించగా, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం – క్రీడల ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం” అనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, పీఈటి దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.