108 TDRలలో 50 మందికి Sale Option కల్పించినందుకు, మిగిలిన 58 మందికి కూడా TDRలు అందించే ప్రక్రియ ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు సింహాచలం BRTS బాధితుల తరఫున భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
అలాగే, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అడవివరం గ్రామ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం, అలాగే అడవివరం, పాత అడవివరం గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించాలని పాశర్ల ప్రసాద్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని వినతిపూర్వకంగా కోరారు.



