దుర్గంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు దాతలు 40 లీటర్ల సామర్థ్యం గల వాటర్ కూలర్‌ను బుధవారం బహుకరించారు. ఎంఈఓ తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దాత బోడే పవన్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ కూలర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ కూలర్ అందించడం అభినందనీయమన్నారు. దాతల సేవా దృక్పథం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హజరత్, ఎస్‌ఎంసీ ఛైర్మన్ మోహన్రావు, మాజీ ఎంఈఓ జి. ఓబుల్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

దుర్గంపల్లి ప్రభుత్వ పాఠశాలకు వాటర్ కూలర్ వితరణ