పి.గన్నవరం నుండి సెప్టెంబర్ 8 పున్నమి ప్రతినిధి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కోనసీమజిల్లా ప్రాంతంలో విద్యార్థులకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే కోనసీమ కు రైలు రావాల్సి దేనని విద్యార్థి జెన్ జి పేర్కొంది.రైలు రాక ఆలస్యం అవడాన్ని నిరసిస్తూ అమలాపురం ముమ్మిడివరం పి గన్నవరం నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యన్ కోనసీమ ప్రజానికానికి హామీ ఇచ్చి ఇప్పటికే రెండున్నర దశాబ్దాలు పూర్తయిందని గుర్తు చేసుకున్నారు.రైలు కనెక్టివిటీ లేని ప్రాంతంగా కోనసీమ ప్రాంతం చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి రానివ్వబొమని విద్యార్థి జెన్ జీ ప్రతిన చేసింది.ఆయా కార్యక్రమాల్లో కోనసీమ జేఎసి నాయకులు బండారు రామమోహన్ రావు,కరాటం నరసింహరావు,డా.రాయుడు శ్రీరామ చంద్రమూర్తి,గంధం శ్రీరామచంద్రమూర్తి,నూకల శ్రీనివాస్,సఖిలే వెంకటేశ్వరావు,కారటం ప్రవీణ్,జంగా రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


