Monday, 7 September 2026
  • Home  
  • పేదింటి కలలకు రెక్కలు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం!
- నిర్మల్

పేదింటి కలలకు రెక్కలు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం!

బైంసా,హంపోలి (కే): పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 07 :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా హంపోలి (కే) గ్రామానికి చెందిన శ్రీమతి సింధె రంజిత గారి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పాటిల్ గారి సహకారంతో ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఇంటి మంజూరుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పాటిల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి బండారి పోసాని బాయి (అశోక్), పంచాయతీ కార్యదర్శి శ్రీ కె. ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.