Sunday, 6 September 2026
  • Home  
  • రెండేళ్ల నమ్మకం.. సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం
- తిరుపతి

రెండేళ్ల నమ్మకం.. సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం

చిట్వేల్‌: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చిట్వేల్‌ మండలం కె.కందులవారిపల్లి పంచాయతీలో శనివారం ‘రెండేళ్ల నమ్మకం–సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, కుడా చైర్మన్‌ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వరలక్ష్మి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.