బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయంలో హెచ్ఐవి నివారణ చట్టం 2017, ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరియు సామాజిక భద్రత పథకాలపై హెచ్ఐవి గురైన వ్యక్తులకు మరియు దళిత బహుజన సమాజానికి అర్థ వార్షిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ హెచ్ఐవి గురైన వ్యక్తులను నింద మరియు వివక్షతలకు గురి చేసినట్లయితే వారు చట్టపరంగా శిక్షార్హులన్నారు. విద్యాసంస్థల్లో గాని,పని ప్రదేశాల్లో గాని,నివాసముండే చోట గాని వారిని వేరు భావంతో చూడడం ద్వారా జైలు శిక్షకు గురవుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా లభించే ఆరోగ్య సేవలు మరియు సామాజిక భద్రత పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ చట్టంపై శిక్షణా కార్యక్రమం