Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

సీజ్ చేసినా.. దర్జాగా వైద్యం! తుర్కయంజాల్‌లో నకిలీ వైద్యుల దందా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీజ్ చేసినా.. దర్జాగా వైద్యం! తుర్కయంజాల్‌లో నకిలీ వైద్యుల దందా?

సీజ్ చేస్తారు… గంటల్లోనే ఓపెన్ చేస్తారు!

దొంగ క్లినిక్ బాగోతం.. అధికారులకే సవాల్!

కేసులు పెట్టినా నో ఫికర్.. సీజ్ చేసినా లెక్కచేయని వైనం

అర్హత లేని వైద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

వైద్యశాఖ పర్యవేక్షణపై స్థానికుల అనుమానాలు

తుర్కయంజాల్:
అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలపై వైద్యశాఖ అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించి పలు క్లినిక్‌లు, ల్యాబ్‌లపై కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు సమాచారం. అయితే సీజ్ చేసిన కొన్ని కేంద్రాలు కొద్దికాలానికే తిరిగి తెరుచుకుని యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ డివిజన్ ప్రధాన కూడలిలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ‘రాజర్షి ఇన్ఫర్మరీ’ పేరుతో కొనసాగుతున్న క్లినిక్‌పై గతంలో అధికారులు అనుమతులు, అర్హతలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసి, నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం అదే క్లినిక్ తిరిగి కొనసాగుతుండటంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. సీజ్ చేసిన కేంద్రం తిరిగి ఎలా ప్రారంభమైంది? అధికారులు తీసుకున్న చర్యలు ఏమయ్యాయి? తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన విషయం సంబంధిత అధికారుల దృష్టికి రాలేదా? అంటూ వారు నిలదీస్తున్నారు.

కేసులు పెట్టినా… భయం లేదా?

గతంలో కేసులు నమోదు చేసి సీజ్ చేసిన మరికొన్ని క్లినిక్‌లు కూడా తిరిగి తెరుచుకుని వైద్య సేవలు అందిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన తర్వాత నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భయం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే రోగుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

తుర్కయంజాల్ పరిధిలోని అనుమతులు లేని క్లినిక్‌లు, ల్యాబ్‌లపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో సీజ్ చేసిన కేంద్రాలను తిరిగి పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సీజ్ చేసిన క్లినిక్‌లు మళ్లీ ఎలా తెరుచుకుంటున్నాయి?
కేసులు నమోదైనా అక్రమ వైద్యం ఎందుకు ఆగడం లేదు?
వైద్యశాఖ పర్యవేక్షణ ఎక్కడ?

అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

సీజ్ చేసినా.. దర్జాగా వైద్యం! తుర్కయంజాల్‌లో నకిలీ వైద్యుల దందా?

సీజ్ చేసినా.. దర్జాగా వైద్యం! తుర్కయంజాల్‌లో నకిలీ వైద్యుల దందా?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *