వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు జిల్లా, మాచర్ల: అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.
- CAA దరఖాస్తు చేసుకున్న ఓ బంగ్లాదేశీయుడి వ్యవహారంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
- ముందుగా కొంత నగదు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
పల్నాడు జిల్లా, మాచర్ల:
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.
CAA దరఖాస్తు చేసుకున్న ఓ బంగ్లాదేశీయుడి వ్యవహారంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముందుగా కొంత నగదు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు జిల్లా కార్యాలయానికి చెందిన మరో కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.