వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కాళహస్తి, ఆగస్టు 30, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదివారం నాడు స్వర్గీయ పీఆర్ మోహన్ - ఇందిరల కుమార్తె డింపుల్, రాజేష్‌ల వివాహ మహోత్సవ వేడుకకు…
- నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కళ్యాణ మండపం వద్ద కుటుంబ సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు పూర్ణకుంభంతో సాదరంగా ఘన స్వాగతం పలికారు.
- అనంతరం వివాహ వేదికపై కొలువై ఉన్న నూతన వధూవరులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా అభినందించారు.
శ్రీ కాళహస్తి, ఆగస్టు 30, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదివారం నాడు స్వర్గీయ పీఆర్ మోహన్ – ఇందిరల కుమార్తె డింపుల్, రాజేష్‌ల వివాహ మహోత్సవ వేడుకకు అత్యంత వైభవంగా హాజరయ్యారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కళ్యాణ మండపం వద్ద కుటుంబ సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు పూర్ణకుంభంతో సాదరంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం వివాహ వేదికపై కొలువై ఉన్న నూతన వధూవరులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా అభినందించారు. కొత్త జంటపై అక్షింతలు వేసి, వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో, సకల సుఖసంతోషాలతో దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నియోజకవర్గ పర్యటనకు విచ్చేసి, స్థానిక కుటుంబ శుభకార్యంలో పాలుపంచుకోవడం ఇక్కడి ప్రజలపై, పార్టీ శ్రేణులపై ఆయనకున్న ఆత్మీయతకు నిదర్శనమన్నారు. ఈ వైభవ వివాహ వేడుకలో తిరుపతి జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, పాత్రికేయులు, మరియు వేలాది మంది బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులను దీవించారు.