Tuesday, 22 September 2026
  • Home  
  • *వద్దూ..డ్రగ్స్ వద్దూ..! క్రీడలే.. ముద్దు*
- తిరుపతి

*వద్దూ..డ్రగ్స్ వద్దూ..! క్రీడలే.. ముద్దు*

* తిరు నగరిలో అమరావతి ఛాంపియన్ షిప్ 2026 విజేతల గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ * క్రీడలతోనే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం: శాప్ చైర్మన్ * గంజాయి అక్రమ రవాణా పై పిడి యాక్ట్ తిరుపతి జిల్లా ఎస్పీ తిరుపతి (ఎస్వీయూ) – ఆగస్టు 28 ఉన్నవి ప్రతినిధి యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిపించాలనే లక్ష్యంతో తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో ఎస్వీయూ తారకరామా గ్రౌండ్స్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసై జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, దీనికి విరుగుడుగా క్రీడల పట్ల మొగ్గు చూపాలని యువతకు సూచించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. యువత గంజాయికి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడల వైపు మొగ్గు చూపాలని ఆయన అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై ప్రత్యేక నిఘా, అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డాగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. *ఆకట్టుకున్న విద్యార్థుల ఫ్లాష్‌మాబ్* ర్యాలీ లో ఎస్ యు సాంస్కృతిక కోఆర్డినేటర్ డా. పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు ప్రదర్శించిన యాంటీ డ్రగ్స్ ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, యువత క్రీడలు, విద్య వైపు అడుగులు వేయాలనే సందేశాన్ని విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా చాటిచెప్పారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్రీడాకారులు, విద్యార్థులు, యువతతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ శ్రీమతి ఎస్. భరణి, ఐఎఫ్‌ఎస్, ఎన్.ఎన్.ఎస్ కోఆర్డినేటర్ డా పాకనాటి హరికృష్ణ, పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

* తిరు నగరిలో అమరావతి ఛాంపియన్ షిప్ 2026 విజేతల గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ
* క్రీడలతోనే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం: శాప్ చైర్మన్
* గంజాయి అక్రమ రవాణా పై పిడి యాక్ట్ తిరుపతి జిల్లా ఎస్పీ

తిరుపతి (ఎస్వీయూ) – ఆగస్టు 28 ఉన్నవి ప్రతినిధి

యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిపించాలనే లక్ష్యంతో తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో ఎస్వీయూ తారకరామా గ్రౌండ్స్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసై జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, దీనికి విరుగుడుగా క్రీడల పట్ల మొగ్గు చూపాలని యువతకు సూచించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. యువత గంజాయికి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడల వైపు మొగ్గు చూపాలని ఆయన అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై ప్రత్యేక నిఘా, అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డాగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

*ఆకట్టుకున్న విద్యార్థుల ఫ్లాష్‌మాబ్*
ర్యాలీ లో ఎస్ యు సాంస్కృతిక కోఆర్డినేటర్ డా. పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు ప్రదర్శించిన యాంటీ డ్రగ్స్ ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, యువత క్రీడలు, విద్య వైపు అడుగులు వేయాలనే సందేశాన్ని విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా చాటిచెప్పారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్రీడాకారులు, విద్యార్థులు, యువతతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ శ్రీమతి ఎస్. భరణి, ఐఎఫ్‌ఎస్, ఎన్.ఎన్.ఎస్ కోఆర్డినేటర్ డా పాకనాటి హరికృష్ణ, పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.