Thursday, 24 September 2026
  • Home  
  • తెలుగంటే నాకిష్టం (కవిత) -డా. బద్రి పీర్ కుమార్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగంటే నాకిష్టం (కవిత) -డా. బద్రి పీర్ కుమార్

ఆగస్టు 29 స్వర్గీయ శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఈ కవిత తెలుగంటే నాకిష్టం. ఆత్మీయ అనుకరణ సందేశం తరతరాల అనుబంధ వికాసం సంభాషించే వారి నిత్య సంతోషం భావి భారతాన తెలుగు నేల ఆవాసం అమ్మానాన్నల అన్నాతమ్ముల అక్కా చెల్లెల అనురాగానికి అలంకరణ స్పందించు హృదయాంతరాల నవీన తెల్లని పాల వెల్లువల మానసవీణ .. నా తెలుగు మానవ వికాస సంబంధాలు భావాంబుధిలో జలకాలాటలు జీవకోటి పలుకుల చిలకల అలకలు మది నుండి ఉప్పొంగే భవామృతాలు మాతృభాషపై మమకారాలు తెలుగు సంస్కృతి సంస్కారాలు వినసొంపైన ఉల్లాసభరిత శబ్ద తరంగభావాలు వ్యవహారిక ఉచ్చారణలో సుతి మెత్తని మెలికలు తేనె చిరుజల్లుల భావజాలామృతం నిత్యం సేవించే మానవతత్వ ఉన్నతం ధ్వనించే అక్షర సంపద తెలుగు సాహిత్యం మాటల మాటున మనసును మురిపించే సాన్నిహిత్యం దైనందిన జీవన వ్యవహార సూచనాత్మకం సమ్మిళిత భావ ప్రకంపనల సజీవ జాతకం తెలుగుజాతి జగతిలో సౌరభాల వాచకం.. నా తెలుగు ఓ సహజ వెలుగు తెలుగు అందుకే తెలుగంటే నాకిష్టం

ఆగస్టు 29 స్వర్గీయ శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఈ కవిత తెలుగంటే నాకిష్టం.

ఆత్మీయ అనుకరణ సందేశం
తరతరాల అనుబంధ వికాసం
సంభాషించే వారి నిత్య సంతోషం
భావి భారతాన తెలుగు నేల ఆవాసం

అమ్మానాన్నల అన్నాతమ్ముల
అక్కా చెల్లెల అనురాగానికి అలంకరణ
స్పందించు హృదయాంతరాల నవీన
తెల్లని పాల వెల్లువల మానసవీణ .. నా తెలుగు

మానవ వికాస సంబంధాలు
భావాంబుధిలో జలకాలాటలు
జీవకోటి పలుకుల చిలకల అలకలు
మది నుండి ఉప్పొంగే భవామృతాలు

మాతృభాషపై మమకారాలు
తెలుగు సంస్కృతి సంస్కారాలు
వినసొంపైన ఉల్లాసభరిత శబ్ద తరంగభావాలు
వ్యవహారిక ఉచ్చారణలో సుతి మెత్తని మెలికలు

తేనె చిరుజల్లుల భావజాలామృతం
నిత్యం సేవించే మానవతత్వ ఉన్నతం
ధ్వనించే అక్షర సంపద తెలుగు సాహిత్యం
మాటల మాటున మనసును మురిపించే సాన్నిహిత్యం

దైనందిన జీవన వ్యవహార సూచనాత్మకం
సమ్మిళిత భావ ప్రకంపనల సజీవ జాతకం
తెలుగుజాతి జగతిలో సౌరభాల వాచకం.. నా తెలుగు
ఓ సహజ వెలుగు తెలుగు అందుకే తెలుగంటే నాకిష్టం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.