*కుప్పారెడ్డి పాలెంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు*
*కుప్పారెడ్డి పాలెం (దొరవారిసత్రం), ఆగస్టు 28 (పున్నమి న్యూస్):*
రాఖీ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలోని తన నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ మద్దాలి వెంకయ్య కు, ఆయన అక్క వరలక్ష్మి, చెల్లి ప్రమీల ఇంటికి విచ్చేసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.
అనంతరం మద్దాలి వెంకయ్య మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి గుర్తు ఈ రాఖీ పండుగ అని, ప్రతి ఒక్కరూ తమ తోబుట్టువులను ప్రేమగా చూసుకోవాలని కోరారు.
