పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంక్లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి నరేష్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. పోలీసులు సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకులను ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

పోలీస్ శాఖ నిర్వహించే పెట్రోల్ బంకులను ప్రజలు వినియోగించుకోవాలి