విశాఖ: ఉదయాన్నే యాక్సిడెంట్.. యువతి మృతి విశాఖలోని సాగర్ నగర్ రోడ్డులో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టిన ఘటనలో వెనుక కూర్చున్న రాడిసన్ బ్లూ హోటల్ మహిళా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడటంతో KGHకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


