డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం నల్లవంతెన దగ్గర ఉన్న మిరియం డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తమ్మీశ్వరరావు సమక్షంలో
హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.దిశా,జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్, సహకారంతో విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి డి ఎస్ ఆర్ సి సెంటర్ కౌన్సిలర్ జి. కవితచే డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి, ఎయిడ్స్, లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం–2017, ఏఆర్టీ మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, క్యూఆర్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే క్యూ ఆర్ కోడ్ స్కాన్ తో విద్యార్థులతో సెల్ఫ్ రిస్క్ అస్సేస్మెంట్ ఫ్రొం ను ఫిల్ చేయించారు. ఈ కార్యక్రమంలో దిశా, జనకళ్యాణ్ ప్రాజెక్ట్ , ఔట్రీచ్ స్టాఫ్ ఏం వి జ్యోతి, పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల డి ఎస్ ఆర్ సి కౌన్సిలర్ మరియు మిరియం డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

జనకల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌పై మిరియం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం నల్లవంతెన దగ్గర ఉన్న మిరియం డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తమ్మీశ్వరరావు సమక్షంలో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.దిశా,జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్, సహకారంతో విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి డి ఎస్ ఆర్ సి సెంటర్ కౌన్సిలర్ జి. కవితచే డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి, ఎయిడ్స్, లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం–2017, ఏఆర్టీ మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, క్యూఆర్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే క్యూ ఆర్ కోడ్ స్కాన్ తో విద్యార్థులతో సెల్ఫ్ రిస్క్ అస్సేస్మెంట్ ఫ్రొం ను ఫిల్ చేయించారు. ఈ కార్యక్రమంలో దిశా, జనకళ్యాణ్ ప్రాజెక్ట్ , ఔట్రీచ్ స్టాఫ్ ఏం వి జ్యోతి, పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల డి ఎస్ ఆర్ సి కౌన్సిలర్ మరియు మిరియం డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

