చిర్ల జగ్గిరెడ్డిని కలిసిన తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు
మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో, ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు గోపాలపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తమకు అండగా నిలిచి, అక్రమ అరెస్టును ఖండిస్తూ తమకు మద్దతుగా నిలిచిన చిర్ల జగ్గిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని వారు వివరించారు.తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు చిర్ల జగ్గిరెడ్డి భరోసా కల్పిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
