Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హరనాధపురంలో కమిషనర్ తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హరనాధపురంలో కమిషనర్ తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
  • నందన్ సోమవారం 18వ డివిజన్ హరనాథపురంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు.
  • నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్ల నాణ్యత, పనుల పురోగతిని పరిశీలించి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా నిర్మాణాలు చేపట్టి, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం 18వ డివిజన్ హరనాథపురంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్ల నాణ్యత, పనుల పురోగతిని పరిశీలించి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా నిర్మాణాలు చేపట్టి, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త భవనాలు, అదనపు అంతస్తుల అనుమతులను పరిశీలించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి వేకంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాణిజ్య సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా శానిటేషన్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *