వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ASU, AMS, ARS, AYS, AEWCA, AKS ఆధార్ సొసైటీల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా చేపడుతున్న ఈ ఆందోళనలో భాగంగా తమ సంస్థ ప్రభుత్వం ముందు 15 ప్రధాన డిమాండ్లు ఉంచుతున్నట్లు నేతలు వెల్లడించారు. వీటిలో ప్రధానంగా:
చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని,
సుప్రీంకోర్టులో 1/70 చట్ట సవరణపై వేసిన కేసుల విషయంలో ఆదివాసీల పక్షాన తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,
షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని,
జీవో నెంబర్ 109 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో పోలీసు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ అమలు చేయాలని,
జీవో ఎంఎస్ నెంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలని,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 120 రాయి సెంటర్లకు పక్కా భవనాలు నిర్మించి ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని,
జీవో నెంబర్ 49ను శాశ్వతంగా రద్దు చేయాలని,
టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గూడేలను తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని,
దేశవ్యాప్తంగా ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని,
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులకు రీ-సర్వే చేసి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు జారీ చేయాలని,
ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని,
ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,
సాదా బైనామా జీవో నెంబర్ 76ను రద్దు చేయాలని,
ఆదిలాబాద్ జిల్లా మావాల మండలం కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు పట్టాలతో పాటు నీరు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ప్రజలందరికీ నేతలు పిలుపునిచ్చారు. “జల్, జంగల్, జమీన్ – మా జన్మహక్కు, జై ఆదివాసీ – జై తుడుం దెబ్బ” అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు
Uploaded Video: