Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

అచ్చంపేట :అంతరాల లేని సమాజాన్ని నిర్మించాలని, కులమత భేదాలు లేని వ్యవస్థ కావాలని పోరాడిన వ్యక్తి సూరవరం సుధాకర్ రెడ్డి -సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అచ్చంపేట :అంతరాల లేని సమాజాన్ని నిర్మించాలని, కులమత భేదాలు లేని వ్యవస్థ కావాలని పోరాడిన వ్యక్తి సూరవరం సుధాకర్ రెడ్డి -సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్

వార్త ముఖ్యాంశాలు

  • సమాజంలో ఎప్పుడూ కులమత బేధాలు సామాజిక ఆర్థిక అసమానతలు లేని సమాజం ఉండాలని తన జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్ తెలియజేశారు.నేడిక్కడ అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం దగ్గర, సిపిఐ అచ్చంపేట…

సమాజంలో ఎప్పుడూ కులమత బేధాలు సామాజిక ఆర్థిక అసమానతలు లేని సమాజం ఉండాలని తన జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్ తెలియజేశారు.నేడిక్కడ అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం దగ్గర, సిపిఐ అచ్చంపేట తాలూకా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు అగ్ర నాయకుడు అమరజీవి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రధమ వర్ధంతిని నిర్వహించారు, పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, సమాజంలో ఉన్న డబ్బు పలుకుబడి కులం మతం ఇవన్నీ ప్రజలను కలపడానికి ఏకం చేయడానికి పనికి రావాలి అని ప్రజలను విడదీయడానికి కాదు అని నమ్మిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అన్నారు తాను ఒక అగ్రకులంలో పుట్టిన నమ్మిన సిద్ధాంతంలో పీడిత తాడిత ప్రజల సమస్యలకై వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అని వారు కొనియాడారు భారత దేశమే కాక ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించిన అనుభవం ప్రపంచం మెచ్చిన నేతగా ఎదిగిన కూడా మచ్చుకైనా ఆయనలో అసహనం గాని ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం గానీ చూడలేదన్నారు మనిషిని మనిషిగా చూసిన మహాతరమైన మనిషి సుధాకర్ రెడ్డి అని వారు తెలియజేశారు సుధాకర్ రెడ్డి గారికి నాగర్ కర్నూల్ జిల్లాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వీడియో తీయలేని బంధం ఉందన్నారు ఆయన పుట్టిన ఊరు నాగర్ కర్నూలు జిల్లాలోని కోడేరు మండలంలో కొండ్రావుపల్లి గ్రామం అలా పుట్టిన గడ్డకు న్యాయం కోసం చేయడం కోసం ఆయన ఎన్నో ప్రజా పోరాటాల నిర్వహించారు ఈ జిల్లాలో కరువు రాక్కసి విలయతాండవం చేసినప్పుడు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు ఆకలి చావులు జరిగినప్పుడు ఇక్కడ అంబలి కేంద్రాల్లో పెట్టి ప్రజలను ఆదుకున్న మహత్తర మైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని చుట్టూ జీవనదులు పారుతున్న బంగారు పంటలు ఇచ్చే భూములున్న కరువు ఎందుకు ఉందని ప్రశ్నించి ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని కొల్లాపూర్ లోని రేగుమానుగడ్డ నుండి ఒకసారి హైదరాబాదు వరకు మరొకసారి మహబూబ్నగర్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు చివరిగా ఒకసారి అదే రేగుమాను గడ్డ నుంచి వరంగల్ వరకు యాత్రను నిర్వహించారు కమ్యూనిస్టు పార్టీ ఆయన తర్ఫీతు ద్వారా నాయకులైన వారే ఆయన ఈరోజు మన మధ్యలో భౌతికంగా లేకపోయినా వారు ఇచ్చిన స్ఫూర్తి వారి పోరాట ప్రతిమ నిత్యం మా మదిలో మెదులుతూనే ఉంటుందని వారు కలలు కన్నా సమ సమాజ స్థాపన కోసం చివరిదాకా పోరాడుతామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ అచ్చంపేట సీనియర్ నాయకులు ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి మాడుగుల నరసింహ, సిపిఐ సీనియర్ నాయకులు ఎండి, బషీర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, గోరేటి నరేష్, బలముల ప్రేమ్ కుమార్, సిపిఐ అచ్చంపేట పట్టణ నర్రా తిరుపతమ్మ, యుఎస్ఎఫ్ఐ నాయకులు ఎండి, సయ్యద్,అలివేల, చిట్టెమ్మ , నిరంజనమ్మ ఫన్నీ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *